: ట్యునీషియాలో దాడి మా పనే!: ఐఎస్ఐఎస్
ట్యునీషియాలోని బార్డో మ్యూజియంపై దాడికి పాల్పడింది తామేనని ప్రపంచానికి సవాలు విసురుతున్న తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. యూరోపియన్ టూరిస్టులు సందర్శించే ఈ మ్యూజియంలో విదేశీయులను బందీలుగా పట్టుకునేందుకు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పన్నిన కుట్రను ట్యునీషియా భద్రతా బలగాలు విచ్ఛిన్నం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ప్రయత్నం భగ్నమైనంత మాత్రాన ఆగిపోమని, ఇలాంటి మరిన్ని దాడులు చేస్తామని ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. కాగా, రెండు రోజుల క్రితం ట్యునీషియా పార్లమెంటు భవనానికి సమీపంలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.