: రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం... 40 గుడిసెలు దగ్ధం
హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నలంద కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు యత్నించినప్పటికీ, గాలి కారణంగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న గుడిసెలకూ విస్తరించాయి. దీంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఘటనలో 40 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.