: పార్లమెంటులో తెలంగాణ డిప్యూటీ సీఎం... అక్కడ పనేంటని ప్రశ్నించిన రేవంత్!


ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మొన్న పార్లమెంటులో తళుక్కుమన్నారు. గడచిన ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగిన కడియం శ్రీహరి, ఆ తర్వాత రాజయ్య బర్తరఫ్ తర్వాత తెలంగాణ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయినా ఆయన ఇప్పటిదాకా తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. అలాగని రాష్ట్రంలో ఇటు అసెంబ్లీతో పాటు ఇటు మండలిలోనూ సభ్యుడిగా లేరు. ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సభలో ఉండి సభ్యులకు సమాధానాలు చెప్పడంతో పాటు రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాల్సిన శ్రీహరి పార్లమెంటుకు ఎందుకు వెళ్లారని, అసలక్కడ ఆయనకేం పని? అంటూ టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News