: టీడీపీ నొక్కింది నాగొంతు కాదు... ప్రజల గొంతు: జగన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తన మైక్ కట్ చేశామనే అధికార పక్షం భావిస్తోందని, కానీ వారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు నొక్కేశారన్న విషయం గుర్తించడం లేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ట్విట్లర్లో పేర్కొన్నారు. బడ్జెట్ పై అసెంబ్లీలో వినిపించాల్సిన తన వాదనను మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలకు వినిపిస్తానని ఆయన ట్వీట్ చేశారు. కాగా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా లోటస్ పాండ్ కు చేరుకున్నారు. పార్టీ నేతలతో కలిసి జగన్ సమావేశం కానున్నారు. అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.