: రైల్వేల్లో 'కాయకల్ప' హెడ్ గా రతన్ టాటా
భారతీయ రైల్వేల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రతిపాదించిన రైల్వే ఇన్నోవేషన్ కౌన్సిల్ 'కాయకల్ప'కు హెడ్ గా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను నియమించాలని కేంద్రం భావిస్తోంది. రైల్వేల్లో వినూత్న మార్పులు తీసుకురావడం ద్వారా రైల్వే వ్యవస్థను తలెత్తుకు నిలపడమే లక్ష్యమని చెబుతూ, సురేష్ ఈ కౌన్సిల్ ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ కౌన్సిల్ లో రతన్ తో పాటు రెండు రైల్వే యూనియన్ల నేతలు శివ గోపాల్ మిశ్రా, ఎం.రాఘవయ్యలు సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది. కాగా, గత వారంలో రతన్ టాటా, సురేష్ ప్రభులు సమావేశం అయిన సంగతి తెలిసిందే.