: సెమీస్ లో భారత్ ప్రత్యర్థి తేలేది నేడే... మరికాసేపట్లో ఆసీస్, పాక్ మధ్య క్వార్టర్ ఫైనల్!


వరల్డ్ కప్ లో టీమిండియా సునాయాసంగా సెమీ ఫైనల్ చేరుకుంది. నిన్నటి మెల్ బోర్న్ లోని ఎంసీజీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఏకపక్ష విజయంతో భారత్ సగర్వంగా సెమీస్ లోకి అడుగిడింది. ఇక, టీమిండియాతో సెమీస్ లో తలపడేదెవరన్న విషయం నేటి సాయంత్రంలోగా తేలిపోనుంది. ఆడిలైడ్ లోని ఓవల్ స్టేడియంలో మరికాసేపట్లో జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో నెగ్గే జట్టే, ఈ నెల 26న సిడ్నీలో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్ లలో ఆసీస్ నాలుగింటిలో విజయం సాధించగా, ఓ మ్యాచ్ లో ఓడింది. మరో మ్యాచ్ లో ఫలితం తేలలేదు. దీంతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన ఆ జట్టు పటిష్ఠంగానే ఉంది. ఇక గ్రూప్-బీలో ముక్కుతూ, మూలుగుతూ ఆడిన ఆరు మ్యాచ్ లలో నాలుగింటిలో గెలిచి, రెండు మ్యాచ్ లలో పరాజయం పాలైన పాక్ జట్టు తన గ్రూప్ లో మూడో స్థానంలో నిలిచింది. నేటి క్వార్టర్స్ లో విజయం కోసం ఇరు జట్లు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి.

  • Loading...

More Telugu News