: విభజన వివాదాల పరిష్కారానికి హైదరాబాదుకు కేంద్ర బృందం


పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పడిన రెండు రాష్ట్రాల్లో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర బృందం హైదరాబాదు రానుంది. ఏకే సింగ్ నేతృత్వంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారుల బృందం సమస్యలపై చర్చించేందుకు నేటి రాత్రికి హైదరాబాదు చేరుకోనుంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో భేటీ కానుంది. విద్యుత్, నీటి వాటాలు సహా విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలపై కేంద్ర బృందం చర్చించనుంది. విభజన కారణంగా నెలకొన్న సమస్యలపై ఇరు రాష్ట్రాలు కేంద్రానికి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర బృందం ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుందన్న విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News