: చాలా ఇంజెక్షన్లు చేస్తున్నారు... బాతులా పరిగెట్టాల్సి వస్తోంది: షారూఖ్
చాలా ఇంజెక్షన్లు చేస్తున్నారని, దీనివల్ల నడవలేకపోయినా బాతులా పరిగెట్టాల్సి వస్తోందని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ట్విట్లర్లో వాపోయాడు. కింగ్ ఖాన్ తాజా సినిమా 'ఫ్యాన్' షూటింగ్ లో కండరాలు పట్టేయడంతో నొప్పితో బాధపడుతున్నాడు. క్రొయేషియాలో జరుగుతున్న షూటింగులో పాల్గొంటున్న షారూఖ్ తన పరిస్థితిని ట్విట్లర్లో అభిమానులకు వివరించాడు. తనకు బాతులంటే ఇష్టం ఉండదని, కానీ, బాతులా పరిగెట్టాల్సి వస్తోందని షారూఖ్ పేర్కొన్నాడు. సినిమా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు షారూఖ్ నొప్పిని సైతం పట్టించుకోవడం లేదని అతని అభిమానులు సంబరపడిపోతున్నారు.