: విదేశీ జైళ్లలో మగ్గుతున్న 6,290 మంది భారతీయులు
6,290 మంది భారతీయులు విదేశీ జైళ్లలో మగ్గుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) వీకే సింగ్ తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 72 దేశాల్లో భారతీయ ఖైదీలు ఉన్నారని అన్నారు. అత్యధికంగా సౌదీ జైళ్లలో 1,508 మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జైళ్లలో 782 మంది, నేపాల్ జైళ్లలో 614 మంది, యునైటెడ్ కింగ్ డమ్ జైళ్లలో 437 మంది, పాకిస్థాన్ జైళ్లలో 352 మంది భారతీయులు ఖైదీలుగా మగ్గిపోతున్నారని ఆయన రాజ్యసభకు తెలిపారు.