: ఆ దృశ్యం అందరినీ కదిలించింది... గుండెలు బరువెక్కాయి!


అవినీతిని ఎత్తి చూపినందుకు బెదిరింపులు ఎదుర్కొని, ఒత్తిళ్లకు లోనై ఆత్మహత్యకు పాల్పడిన కర్ణాటక ఐఏఎస్ అధికారి డీకే రవి కుమార్ (36)కి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, ఆయన మరణం కుటుంబ సభ్యులనే కాదు, పెంపుడు కుక్కను సైతం తీవ్ర విషాదానికి లోను చేసింది. బంధుమిత్రులు, ప్రజల సందర్శనార్థం రవి మృతదేహాన్ని శవపేటికలో ఉంచగా, ఆ శునకం దానివద్దే తిరుగుతూ, తన యజమాని కోసం విలపించింది! అంత్యక్రియల వేళ కూడా అదే సీన్ కనిపించింది. శ్మశానంలో అంత్యక్రియలు జరిగిన స్థలం నుంచి ఆ జాగిలం కదల్లేదు. చివరికి ఆ ఐఏఎస్ అధికారి కుటుంబ సభ్యులు వెళ్లిపోతుండడంతో, అది కూడా బాధాతప్త హృదయంతో అక్కడి నుంచి నిష్క్రమించింది. ఇది చూసిన అందరి గుండెలు బరువెక్కిపోయాయి. ఇసుక, రియల్ మాఫియా కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయారని కర్ణాటకలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News