: వజ్రాల దొంగలు దొరికారు!


సూరత్ కు చెందిన ఒక వజ్రాల ఎగుమతి సంస్థ నుంచి రూ. 2.07 కోట్ల విలువ చేసే వజ్రాలను దొంగిలించిన వ్యక్తికి సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శ్రీ రామ్ కిషన్ ఎక్స్ పోర్ట్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, నిర్మాణంలో ఉన్న భవంతిలో దాచిన వజ్రాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అంతకుముందు, మొత్తం 2,500 కారట్ ల బరువున్న రూ. 2.07 కోట్ల విలువైన ముడి వజ్రాలతో కొరియర్ బాయ్ సాగర్ రమేష్ కపూరియా పారిపోయాడని సంస్థ యజమాని ఫిర్యాదు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు రమేష్ కపూరియా కోసం వేట మొదలుపెట్టామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News