: రైల్లో చోరీ... మధ్యప్రదేశ్ ఆర్థికమంత్రినీ వదల్లేదు!
జబల్పూర్-నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీదొంగలు చెలరేగిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో కోసి కలాన్ వద్ద ఈ దోపిడీ జరిగింది. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తున్న మధ్యప్రదేశ్ ఆర్థికమంత్రి జయంత్ మలయ్యా, ఆయన భార్య సుధ కూడా దోపిడీకి గురయ్యారు. కంపార్ట్ మెంట్లో చొరబడ్డ దొంగలు తుపాకులతో బెదిరించి దోచుకున్నారు. ఈ ఘటనను మంత్రి భార్య సుధ నిర్ధారించారు. దీనిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రతి రైలులోనూ పోలీసులను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, కానీ, ఇలాంటివి చోటుచేసుకోకుండా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. దీనిపై రైల్వే శాఖ ఎంక్వైరీకి ఆదేశించింది. ఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బందిని సస్పెండ్ చేసింది.