: స్పీకర్ స్థానంపై గౌరవముంది... కోడెల తీరుపైనే అసంతృప్తి: కోటంరెడ్డి
శాసనసభలో సభాపతి (స్పీకర్) స్థానంపై తమకు ఎనలేని గౌరవం ఉందని విపక్ష వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆ స్థానంలో కూర్చున్న కోడెల శివప్రసాద్ వ్యవహార తీరుపై తాము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఎనిమిది మంది వైసీసీ సభ్యుల సస్పెన్షన్, సభ నుంచి మిగిలిన సభ్యులతో కలిసి జగన్ వాకౌట్ తర్వాత అసెంబ్లీ ఆవరణలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికార పక్షం వైపు మొగ్గడమే కాక ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో నిర్దేశించే రీతిలో కోడెల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.