: ధోనీ మాటకు విలువిచ్చిన అభిమానులు... త్రివర్ణమయమైన ఎంసీజీ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన పిలుపునకు అభిమానుల నుంచి మంచి స్పందనే వచ్చింది. బంగ్లాదేశ్ తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు వేదికైన మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ను త్రివర్ణమయం చేయాలన్న అతడి సూచనను నిజం చేశారు. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ త్రివర్ణమయమైంది. మ్యాచ్ ప్రారంభం కాకముందే చేరుకున్న అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోయింది. ఈ మెగా టోర్నీలో మ్యాచ్ లకు భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నారని, వారెంతో మద్దతిస్తున్నారని నిన్న ధోనీ పేర్కొన్నాడు. ఇదే తరహా ప్రోత్సాహాన్ని మెల్ బోర్న్ క్వార్టర్ ఫైనల్లోనూ చూపుతారని ఆశిస్తున్నట్టు అతడు తెలిపిన సంగతి తెలిసిందే.