: వడ్డీలు పెరిగితేనేం?... అమెరికా బాటలోనే నడుస్తున్న భారత్!


స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు నమోదవుతాయని భావించిన నిపుణులు సైతం విస్తుపోయేలా, భారీ లాభాల్లో సెషన్ మొదలయింది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచక తప్పదని ఫెడ్ రిజర్వ్ చేసిన ప్రకటన ఆ దేశంలో స్టాక్ మార్కెట్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. యూఎస్ డోజోన్స్ ఫ్యూచర్స్ ఏకంగా 215 పాయింట్ల వృద్ధిని చూపిస్తోంది. అమెరికా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయంటే అర్థముంది. కానీ, అమెరికా ఆదాయంపై ప్రధానంగా ఆధారపడి నడుస్తున్న ఎన్నో భారత కంపెనీలకు వడ్డీ రేట్ల పెంపు నష్టం కలిగించే అంశమే. యూఎస్ ఫెడ్ వ్యాఖ్యలతో జపాన్, హాంగ్ కాంగ్ తదితర ఆసియా దేశాల మార్కెట్లు నష్టాల్లో ఉండగా, ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకుపోయింది. దీంతో అమెరికా వెంటే మేమూ నడుస్తామని భారత ఇన్వెస్టర్లు స్పష్టం చేసినట్లయింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 318 పాయింట్ల లాభంతో 28,941 పాయింట్ల వద్ద, నిఫ్టీ సూచీ 92 పాయింట్లు పెరిగి 8,778 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News