: సిలిండర్ల పేలుడు ధాటికి పగుళ్లిస్తున్న ఇళ్లు... కొండెక్కి కూర్చున్న ఏనుగుమర్రి వాసులు


కర్నూలు జిల్లా పరిధిలోని బెంగళూరు హైవేపై సిలిండర్ల పేలుడు తీవ్రత క్షణక్షణానికి పెరిగిపోతోంది. లారీలోని సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలుతున్న నేపథ్యంలో సమీపంలోని ఏనుగుమర్రి గ్రామానికి చెందిన ఇళ్లు పగుళ్లిస్తున్నాయి. దీంతో భయకంపితులైన ఏనుగుమర్రి వాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. సమీపంలోని కొండపైకి చేరుకున్న వారంతా, సిలిండర్ల పేలుళ్లను బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. నిండా 400 గ్యాస్ సిలిండర్లతో కర్నూలు వైపు బయలుదేరిన లారీ, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్దకు చేరుకోగానే అందులోని సిలిండర్ల పేలుళ్లతో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే, లారీలోని సిలిండర్లన్నీ ఒకే సారి కాకుండా ఒక్కొక్కటిగా పేలుతున్న క్రమంలో లారీ సమీపంలోకి వెళ్లేందుకు అగ్నిమాపక సిబ్బందికి కూడా సాధ్యపడటం లేదు. లారీలోని సిలిండర్లన్నీ పేలిపోయిన తర్వాత కాని అక్కడికి చేరుకునే అవకాశం రాకపోవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News