: బడ్జెట్ పై రసమయి కీలక ప్రసంగం... మ్యాన్ ఆప్ ది సెషన్ అంటూ హరీశ్ ప్రశంస
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారంటూ రాష్ట్ర సాంస్కృతిక మండలి సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కితాబిచ్చారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పై రసమయి చేసిన ప్రసంగం సభ మొత్తాన్ని మైమరపించేసింది. దీంతో సభ వాయిదా పడగానే లాబీల్లోకి వచ్చిన రసమయిని పలువురు సభ్యులు ప్రశంసలతో ముంచెత్తారు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ మీరేనంటూ ఆయనను ఆకాశానికెత్తేశారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన హరీశ్ రావు, ‘‘మ్యాన్ ఆప్ ది మ్యాచ్ కాదు... మ్యాన్ ఆప్ ది సెషన్. ఈ సెషన్ లో ఇప్పటిదాకా రసమయి ప్రసంగమే హైలైట్. బాగా మాట్లాడాడు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.