: రేప్ కు వ్యతిరేకంగా ర్యాప్ సాంగ్... ఆన్ లైన్ లో హల్ చల్


అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశంలోని మహిళలు ఎలుగెత్తడం ఇప్పటిదికాదు. ఎన్నో ఏళ్లుగా వివిధ రూపాల్లో వారు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చడం తెలిసిందే. తాజాగా, ఇద్దరు ముంబయి యువతులు రేప్ లపై తమ వైఖరిని దృఢంగా చాటారు. పంఖూరీ అవస్తి, ఉపేక జైన్ అనే ఈ అమ్మాయిలు అత్యాచారాలను నిరసిస్తూ విలక్షణ రీతిలో ఓ ర్యాప్ సాంగ్ ను ఆలపించారు. దాని వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. యూట్యూబ్ లో లక్షకు పైగా హిట్స్ ను పొందింది ఈ సాంగ్. అమ్మాయిలు ఏ దుస్తులు ధరించారన్నది విషయం కాదని, పురుషులను రెచ్చగొట్టేందుకే అలా ధరిస్తారని భావించరాదని తమ పాటలో ఎలుగెత్తారు. అంతేగాదు, భ్రూణ హత్యలు వంటి ఇతర అంశాలను కూడా వారు తమ గీతంలో ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News