: వ్యర్థాలతో విద్యుత్ తయారు చేస్తామంటూ కేసీఆర్ ను కలిసిన స్వీడన్ ప్రతినిధులు
వ్యర్థాలతో విద్యుత్ తయారు చేస్తామంటూ స్వీడన్ కు చెందిన బిజినెస్ అండ్ గ్రీన్ టెక్నాలజీ ప్రమోషన్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. హైదరాబాదులో సీఎంను కలిసిన సందర్భంగా వారు మాట్లాడుతూ, హైదరాబాదులో ప్రతి రోజూ 4500 మెట్రిక్ టన్నుల వ్యర్థపదార్థాలు, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయని అన్నారు. ప్రతి 1500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో 36 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని వారు చెప్పారు. అలాగే హైదరాబాదులో లభ్యమయ్యే వ్యర్థాలతో 108 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని వారు వెల్లడించారు. తాము చేపట్టనున్న ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణమిచ్చేందుకు సిద్ధంగా ఉందని వారు తెలిపారు. వారి ప్రతిపాదనను శ్రద్ధగా విన్న కేసీఆర్ పరిశీలిస్తామని చెప్పారు.