: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విషం తాగిన ప్రేమికులు


హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో పోలీసులు స్పందించి వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే... ఖైరతాబాదులో నివసించే హేమలత, శ్రీకృష్ణానగర్ లో నివసించే శివ కొంతకాలం ప్రేమించుకున్నారు. విభేదాలు తలెత్తడంతో దూరమయ్యారు. దీంతో, నమ్మించి మోసం చేశాడని, అతనితోనే వివాహం జరిపించాలని హేమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివను పోలీసులు పిలిచి విషయం అడిగారు. హేమలతను వివాహం చేసుకునే ప్రసక్తి లేదని శివ తేల్చిచెప్పడంతో, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఇద్దరూ చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో వారిద్దరూ తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. దీనిని గమనించిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News