: సెమీస్ లో ఇండియాతో తలపడితే... సత్తా చాటుతాం: పాక్ కెప్టెన్


చిరకాల ప్రత్యర్థి ఇండియాతో ప్రపంచకప్ లో మరోసారి తలపడే అవకాశం వస్తే... సత్తా చాటుతామని పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్ అన్నాడు. లీగ్ లో భారత్ చేతిలో పాక్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఓటమిని తాము పట్టించుకోబోమని మిస్బా చెప్పాడు. క్వార్టర్ ఫైనల్స్ లో రెండు జట్లూ గెలిస్తే... సెమీస్ లో రెండూ మరోసారి తలపడతాయి. గత కొంత కాలంగా ఆస్ట్రేలియాలో భారత్ పర్యటిస్తోందని... ఇదే ఆ టీమ్ కు లాభిస్తోందని మిస్బా తెలిపాడు. ఈ టోర్నీలో ఇండియా అంచనాలకు మించి రాణిస్తోందని... కెప్టెన్ గా ధోనీ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పాడు. క్వార్టర్స్ లో రేపు బంగ్లాదేశ్ తో ఇండియా తలపడుతుండగా... ఎల్లుండి ఆస్ట్రేలియాతో పాక్ తలపడబోతోంది.

  • Loading...

More Telugu News