: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: జేడీ శీలం
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ కుంటి సాకులు చెబుతోందని అన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని ప్రజలకు చెబుతున్న టీడీపీ ఎంపీలు, పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై ప్రధాని నుంచి స్పష్టమైన హామీ ఎందుకు పొందలేదని అడిగారు. ఏపీ సమస్యలపై సోనియా గాంధీ కేంద్రాన్ని నిలదీశారని ఆయన చెప్పారు.