: డిసెంబర్ లో భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్: పాక్ హై కమీషనర్


భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ డిసెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పాకిస్థాన్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ చెప్పారు. కోల్ కతా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సిరీస్ యూఏఈలో కానీ, భారత్ లో కానీ జరుగుతుందని అన్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ భారత పర్యటనలో ద్వైపాక్షిక సిరీస్ పై పూర్తి వివరాలు వెల్లడిస్తారని ఆయన తెలిపారు. కాగా, 2012-13లో చివరిసారి భారత్ లో పాక్ ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. 2009 మార్చిలో లాహోర్ లోని గడాఫీ స్టేడియానికి బస్సులో వెళ్తున్న శ్రీలంక ఆటగాళ్లపై దాడి జరిగిన అనంతరం స్వదేశీ మ్యాచ్ లను యూఏఈ వేదికగా పాక్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News