: ధాటిగా ఆడుతున్న దక్షిణాఫ్రికా... స్కోరు 100/1
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ధాటిగా ఆడుతున్నారు. 13.5 ఓవర్లలోనే 100 పరుగులను సాధించారు. ఓపెనర్ ఆమ్లా 16 పరుగులకే ఔట్ అయినప్పటికీ మరో ఓపెనర్ డి కాక్ 53 పరుగులు (43 బంతులు, 9 ఫోర్లు) చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నాడు. డి కాక్ కు జతగా డు ప్లెసిస్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ప్రపంచ కప్ లో సెమీస్ చేరడానికి దక్షిణాఫ్రికాకు మరో 34 పరుగులు మాత్రమే అవసరం.