: దమ్ముంటే పులివెందులలో చర్చకు రా!... జగన్ కు ఎమ్మెల్సీ సతీశ్ రెడ్డి సవాల్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార పక్ష దాడి ముమ్మరమైంది. నిన్నటికి నిన్న ఆటలాడొద్దని చంద్రబాబు వార్నింగ్ ఇవ్వగా, తాజాగా నేటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయనను చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ‘దొంగ’గా అభివర్ణించారు. అసెంబ్లీలో దాడి నేపథ్యంలో వైఎస్ సొంత ఇలాకా పులివెందులకు చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే, పులివెందులలో చర్చకు రమ్మంటూ ఆయన జగన్ కు సవాల్ విసిరారు. సాగునీటి ప్రాజెక్టులపై ఏనాడూ నోరు విప్పని జగన్, సభలో ప్రాజెక్టులపై చర్చకు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.