: లాడెన్ విషయంలో నాడు సీఐఏకు సహకరించిన వైద్యుడి న్యాయవాది మృతి
అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టక ముందు అతని కోసం వెతుకుతున్న సీఐఏకు సహాయం చేసిన పాకిస్థాన్ వైద్యుడు షకీల్ అఫ్రిదీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది సమియుల్లా అఫ్రిది తాజాగా మృతి చెందాడు. ప్రాణ ముప్పు ఎదుర్కొంటున్న సమియుల్లాపై వాయువ్య పాకిస్థాన్ లో దాడి చేసినట్టు రెండు మిలిటెంట్ గ్రూపులు ప్రకటించాయి. కాగా అఫ్రిది కారుపై ఇద్దరు గన్ మెన్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. న్యాయవాదిపై కాల్పులు జరిపిన విషయాన్ని, అతనిని తాముు హత్య చేసిన విషయాన్ని తెహ్రీక్ తాలిబన్ పాకిస్థాన్ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. అంతేగాక అతనికి చట్టపరంగా సహాయం అందిస్తున్న ఇతర న్యాయవాదులను కూడా వదిలిపెట్టమన్నారు.