: వీహెచ్ పీ నేత సాధ్వి ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు... మహాత్మా గాంధీ బ్రిటీష్ ఏజెంట్ అని విమర్శ


మహాత్మాగాంధీ ఓ బ్రిటీష్ ఏజెంట్ అని మొన్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ అంటే, నేడు వీహెచ్ పీ నేత సాధ్వి ప్రాచీ కూడా ఇదే విధంగా వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీ ఓ బ్రిటీష్ ఏజెంట్ అంటూ ఆమె విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని బహరైక్ జిల్లాలో జరిగిన హిందూ సమ్మేళన్ లో పాల్గొన్న సాధ్వి ప్రసంగిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. గాంధీజీ చరఖా వడకటం వలన బ్రిటీష్ పాలన నుంచి భారత్ కు స్వాతంత్ర్యం రాలేదన్నారు. వీర్ సావర్కర్, భగత్ సింగ్ వంటి ధైర్యవంతులైన దేశ బిడ్డల త్యాగ ఫలితం వల్లనే స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. హిందూ లేదా ముస్లిం ఎవరైనా సరే కేవలం ఇద్దరు పిల్లలను కనేందుకు మాత్రమే అనుమతించాలని సాధ్వి అన్నారు. ఒకవేళ ఎవరైనా ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కనేందుకు సిద్ధపడితే ఆ వ్యక్తి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలన్నింటినీ కోల్పోయేలా చట్టం తేవాలన్నారు.

  • Loading...

More Telugu News