: నాలుగో వికెట్ కోల్పోయిన లంక... తిరిమన్నే, జయవర్ధనే ఔట్


వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో సఫారీ బౌలర్లు సత్తా చాటుతున్నారు. శ్రీలంక బ్యాట్స్ మన్ కు కట్టడి చేస్తున్న దక్షిణాఫ్రికా బౌలర్లు, క్రమంగా వికెట్లు తీస్తున్నారు. తొలి ఐదు ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన లంక, 20వ ఓవర్ లో మూడో, 24 ఓవర్ లో నాలుగో వికెట్ కోల్పోయింది. ఆదిలోనే రెండు కీలక వికెట్ల పతనంతో స్తంభించిన లంక స్కోరు బోర్డులో కదలిక తెచ్చిన లంక కీలక బ్యాట్స్ మన్ లాహిరు తిరిమన్నే(41) సఫారీ బౌలర్ ఇమ్రాన్ తాహీర్ కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం సంగక్కర (19)కు మహేల జయవర్ధనే (4) జత కలిశాడు. అయితే ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్ లోనే జయవర్ధనే కూడా వెనుదిరిగాడు. డు ప్లెసిస్ పట్టిన క్యాచ్ తో జయవర్ధనే నిరాశగా వెనుదిరిగాడు. దీంతో సంగక్కరతో కెప్టెన్ మాథ్యూస్ (1) జతకలిశాడు. 24 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయిన లంక 83 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News