: అరెస్ట్ అయిన ఏపీ అంగన్ వాడీ టీచర్లకు మంచినీరు కూడా ఇవ్వని తెలంగాణ పోలీసులు


తమ వేతనాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుంచి అష్టకష్టాలు పడి హైదరాబాద్ కు వచ్చి నిరసన తెలిపిన పాపానికి అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలకు తెలంగాణా పోలీసులు చుక్కలు చూపుతున్నారు. వీరి 'అసెంబ్లీ ముట్టడి'ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించిన సంగతి తెలిసిందే. ఒక వైపు ఎండ మండిపోతూ ఉంటే, తాగడానికి గుక్కెడు మంచినీరు కూడా పోలీసులు ఇవ్వడం లేదని సమాచారం. అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలు తమ గొంతు ఎండిపోతోందని పోలీసులతో మొరపెట్టుకుంటున్నారని, పోలీసులు స్పందించలేదని వార్తలు వచ్చాయి. ఈ ఘటనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, అంగన్ వాడీ మహిళలతో పాటు ఉన్న ఇద్దరు న్యాయవాదులను సైతం అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News