: శివరాత్రికి కూడా సెలవివ్వాలని కోరిన అక్బరుద్దీన్


మత ప్రాతిపదికన ఏర్పాటైన ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ శాసనసభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రంజాన్, క్రిస్ మస్ లకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారని... అదే రీతిలో శివరాత్రికి కూడా సెలవు ఇవ్వాలని కోరారు. యాదగిరి గుట్టతో పాటు మేజర్ చర్చ్ లను కూడా అభివృద్ధి చేయాలని విన్నవించారు. వక్ఫ్ భూములు ఎంతటి వారి అధీనంలో ఉన్నప్పటికీ, స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎప్పుడూ ముస్లింల గురించే మాట్లాడే అక్బర్ నోటి వెంట... పక్కా సెక్యులర్ తరహా మాటలు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  • Loading...

More Telugu News