: ప్రజల ఆగ్రహాన్ని చవిచూసిన మమతా బెనర్జీ... గంట పాటు నిలిచిన కాన్వాయ్


కోల్ కతాలో గతవారం అత్యాచారానికి గురైన నన్ ను పరామర్శించేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు. రాణాఘాట్ సమీపంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను చూసేందుకు వెళ్తున్న మమతను ప్రజలు అడ్డుకున్నారు. ఆమెకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ సుమారు గంటపాటు నిలిచిపోయింది. ఆమె కారు దిగి మాట్లాడుతూ "ఈ ప్రజల్లో రాజకీయ వర్గాలు కలసిపోయి ఉన్నాయని నాకు తెలుసు. నేను సవాలు విసురుతున్నా... నన్ను ఎంత సేపు నిలిపేస్తారు? నిరసనల నుంచి ఎదిగిన నేతను నేను" అని బీజేపీ, సీపీఎం పార్టీలపై విరుచుకు పడ్డారు. ఇక్కడ నిరసన తెలుపుతున్న వారికి దోషులు అరెస్ట్ కావడం ఇష్టం లేదని ఆమె విమర్శించారు. ఆ తరువాత ఆమె బాధితురాలిని కలిసి ధైర్యం చెప్పారు. కాగా, ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

  • Loading...

More Telugu News