: జైలు నుంచి తప్పించుకున్న ‘ఎర్ర’ స్మగ్లర్... గాలిస్తున్న రాజమండ్రి పోలీసులు
రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి ఓ ఎర్రచందనం స్మగ్లర్ తప్పించుకున్నాడు. కొద్దిసేపటి క్రితం వెలుగు చూసిన ఈ ఘటనతో షాక్ తిన్న రాజమండ్రి పోలీసులు సదరు స్మగ్లర్ కోసం గాలింపు మొదలుపెట్టారు. కేసు వాయిదా కోసం నేటి ఉదయం జైలు నుంచి కోర్టుకు తీసుకువెళుతున్న క్రమంలో అతడు పోలీసుల కళ్లుగప్పి అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నాడు. స్మగ్లర్ మస్కా కొట్టిన విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.