: దయచేసి రావద్దు... బలికావద్దు... కూలీలతో మొరపెట్టుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ


కిలో ఎర్రచందనానికి రూ. 300 కూలీగా వస్తుందని ఆశపడి, స్మగ్లర్లతో కలసి శేషాచలం అడవుల్లోకి వస్తున్న కూలీలను దయచేసి రావద్దని టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు వేడుకున్నారు. చెట్లను నరికేందుకు వచ్చి పోలీసు కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని సేలం, ధర్మపురి, తిరువణ్ణామైలై, తిరువళ్లూరు తదితర ప్రాంతాల నుంచి కూలీలు వస్తున్నారని ఆయన తెలిపారు. అడవులను, ముఖ్యంగా ఎంతో విలువైన ఎర్రచందనం చెట్లను కాపాడే దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. త్వరలో జీపీఎస్, అడవుల్లో సీసీ కెమెరాలు, గగనతలం నుంచి అడవులను పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News