: ప్రణబ్ జీ! మీరైనా కల్పించుకోండి!: సస్సెన్షన్ పై నేడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న టీ టీడీపీ
తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురైన టీ టీడీపీ నేతలు మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్నారు. కేసీఆర్ సర్కారు తమను అన్యాయంగా సస్పెండ్ చేసిందని ఆరోపిస్తున్న టీ టీడీపీ నేతలు ఇప్పటికే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఢిల్లీ బాట పట్టక తప్పలేదు. నేటి ఢిల్లీ పర్యటనలో భాగంగా సస్పెండైన నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. 'కనీసం మీరైనా ఈ విషయంలో జోక్యం చేసుకుని సస్పెన్షన్ ను ఎత్తివేసేలా తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని' వారు ప్రణబ్ ను కోరనున్నారు.