: దక్షిణాఫ్రికాకు అగ్నిపరీక్ష తప్పదా?


వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది. అయితే, ఆ జట్టుకు ఇప్పుడు పాత భయం పట్టుకుంది. ఒత్తిడి సమయాల్లో, కీలక మ్యాచ్ లలో కుప్పకూలుతుందన్న పేరును తొలగించుకోవాలని ఎంత కృతనిశ్చయంతో ఉన్నా, మ్యాచ్ రోజున ఏం జరుగుతుందోనని సఫారీ శిబిరం ఆందోళన చెందుతోంది. అందుకే, క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, సాహస యాత్రికుడు మైక్ హార్న్ సాయం తీసుకుంటోంది. ఆయన తన అనుభవాలను క్రికెటర్లతో పంచుకుని, వారిలోని భయాన్ని పారదోలతాడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు భావిస్తోంది. జట్టు కోచ్ రసెల్ డొమింగో మాట్లాడుతూ, స్టెయిన్, మోర్కెల్ కంటే భయానక పరిస్థితులను హార్న్ ఎదుర్కొన్నాడని, అతని అనుభవం ఎంతో ఉపకరిస్తుందని అన్నాడు. అన్ని అర్హతలున్నా, సఫారీలను మాత్రం వరల్డ్ కప్ ఇప్పటివరకు అందకుండా ఊరిస్తోంది. 1992 వరల్డ్ కప్ లో వర్షం అడ్డుతగలగా, 1999, 2007లో దురదృష్టం వెంటాడింది. 2011లో న్యూజిలాండ్ చేతిలో క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలయ్యారు.

  • Loading...

More Telugu News