: పట్టిసీమను అడ్డుకుని చరిత్రహీనులు కావొద్దు: టీడీపీ మంత్రులు
పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకుని చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని వైఎస్సార్సీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. హైదరాబాదులో వారు మాట్లాడుతూ, రాయలసీమ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించి అనంతపురం, కడప జిల్లాల ప్రజలు తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తామని, అలా చేయవద్దని వైఎస్సార్సీపీ కోరుకుంటే ఆ విషయం ప్రకటించాలని వారు సవాలు విసిరారు.