: మంత్రి జగదీశ్ రెడ్డి ఓ చెల్లని రూపాయి: జానారెడ్డి


తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డిపై టీ.సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన జగదీశ్ రెడ్డిపై చర్యలకు పట్టుబడతామన్నారు. అతనో చెల్లని రూపాయని, కుసంస్కారి అని వ్యాఖ్యానించారు. అతని గురించి మాట్లాడటం తన స్థాయికాదని చెప్పారు. అతని అవినీతికి సంబంధించి తమ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ నుంచి పూర్తి సమాచారం తీసుకుంటున్నామన్నారు. పార్టీ నేత చిన్నారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నది అప్రాధాన్య అంశమన్నారు. సొంత ప్రయోజనాల కోసం ఎవరెవరో ఎక్కడో చేరుతుంటారన్న జానా, పార్టీ నుంచి రోజుకొకరు వెళుతున్నారు, వస్తున్నారని పేర్కొన్నారు. టీ.టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను ఎత్తివేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని జానా కోరారు.

  • Loading...

More Telugu News