: సల్మాన్ చేసిన వాటి పట్ల నేను ఎక్సైట్ కాలేను: అమీర్ ఖాన్
బాలీవుడ్ లో నటుడు సల్మాన్ ఖాన్ చిత్రాలు, అతని శైలి పట్ల తాను ఎక్సైట్ కాలేనని, తనకంత సామర్థ్యం లేదని అంటున్నాడు అమీర్ ఖాన్. "అటువంటి సినిమాలకు నేను సరైనవాడిని కాను. అలాంటివి చేయాలంటే నిర్దిష్టమైన ఆకర్షణ ఉండాలి. 'దబాంగ్'లో సల్మాన్ చేసిన బెల్ట్ డ్యాన్స్ స్టెప్ చూస్తే... నేనూ అలా చేసినట్టు ఊహించుకుంటా. అయితే, అలాంటి పూర్తి తరహా చిత్రాన్ని నేను చేయగలనని అనుకోవడం లేదు" అని మిస్టర్ పర్ ఫెక్షనిస్టు పేర్కొన్నాడు. తాను ఎంచుకునే సినిమాల వల్ల షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల కంటే చాలా భిన్నంగా కనిపిస్తానని అన్నాడు. ఒకరకమైన శైలి పట్ల వాళ్లు బాగా ఆకర్షితులయ్యారని, చాలా విజయవంతమయ్యారని అమీర్ చెప్పాడు. వాళ్లకు భారీగా అభిమానుల ఫాలోయింగ్ కూడా ఉందని, కానీ, అటువంటి అంశాలు తనను ఆకర్షించవని, తన శైలి భిన్నమని స్పష్టం చేశాడు.