: కేంద్ర బడ్జెట్ బాగాలేదు... దీంతో ప్రజలకు మేలు జరగదు: కవిత
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై టీఆర్ఎస్ ఎంపీ కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ తో సామాన్యుడికి మేలు జరగదని స్పష్టం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమానికి 55 శాతం, మధ్యాహ్న భోజన పథకానికి 50 శాతం నిధులను తక్కువగా కేటాయించారని ఆరోపించారు. రైతు రుణాల కోసం మరో రూ. 50 వేల కోట్లను కేటాయిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వృద్ధి రేటులో మాత్రం చైనాతో భారత్ పోటీ పడుతోందని చెప్పారు. 2022కల్లా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని కేంద్రం చెబుతోందని... కానీ, ఇందిరా ఆవాస్ యోజన పథకానికి మాత్రం కేటాయింపులను తగ్గించిందని ఆరోపించారు.