: కేసీఆర్ కూడా పార్టీ మారారు: హరీష్ కు గుర్తుచేసిన పువ్వాడ


ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తన దూకుడును పెంచింది. గత సమావేశాల్లో ప్రశాంతంగా ఉన్న కాంగ్రెస్ నేతలు, ఈసారి స్వరాన్ని పెంచారు. విభజన బిల్లులో కొన్ని అంశాల్లో తెలంగాణ నష్టపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఈ అంశంపై పలువురు నేతలు తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ఓ సందర్భంలో, ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చారని, అందువల్ల ఆయనకు అవగాహన తక్కువగా ఉంటుందని... కానీ, సీనియర్ నేత అయిన చిన్నారెడ్డికి కూడా విషయాలు తెలియవా? అంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. దీంతో, హరీష్ పై పువ్వాడ అజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. తమను కించపరిచేలా హరీష్ మాట్లాడటం తగదని... ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పార్టీ మారారన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని చురక అంటించారు. ఆ తర్వాత హరీష్ మాట్లాడుతూ, తనకు అజయ్ ను కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News