: ఏపీ ‘ప్రత్యేకం’ కోసం కాంగ్రెస్ పోరు షురూ... అనంత దీక్షలో రఘువీరా, బొత్స


రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనన్న డిమాండ్ తో ఏపీ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం అనంతపురంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి దీక్షలను ప్రారంభించడమే కాక ఆయనే స్వయంగా దీక్షలో కూర్చున్నారు. రఘువీరాతో పాటు పార్టీ సీనియర్లు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, సాకే శైలజానాథ్ తదితరులు నేటి దీక్షకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News