: మిమ్మల్ని చూసి జాతి గర్వపడుతోంది... మోదీ ట్వీట్


హాకీ వరల్డ్ లీగ్ గ్రూప్-2 ఛాంపియన్ షిప్ ట్రోఫీ గెలిచిన భారత మహిళల హాకీ జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. "మహిళల హాకీ టీమ్ కు అభినందనలు. మీ విజయం చూసి భారత జాతి మొత్తం గర్వపడుతోంది" అంటూ ఈ ఉదయం ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ గ్రూప్-2 పోరులో భారత జట్టు పోలెండ్ పై 3-1 గోల్స్ తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో వందనా కటారియా 15వ నిమిషంలో, 44, 59 నిమిషాల్లో రీతూ రాణి గోల్స్ సాధించారు.

  • Loading...

More Telugu News