: 'చెత్త కథానాయిక'గా హ్యాట్రిక్ కొట్టిన సోనాక్షి!


ఏడవ గోల్డెన్ కేలా అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పేరును 'చెత్త కథానాయిక'గా ప్రకటించారు. 'యాక్షన్ జాక్సన్', 'లింగా', 'హాలిడే' చిత్రాల్లో ఆమె నటనకుగానూ అవార్డు ప్రకటించారు. కత్రినా కైఫ్, సోనమ్ కపూర్, తమన్నా భాటియా, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ లను వెనక్కునెట్టి మరీ సొనాక్షి కేలా అవార్డుకు ఎంపికైంది. గతేడాదిలో 'ఆర్.రాజ్ కుమార్', 2013లో పలు సినిమాల్లో తన నటనకుగానూ కూడా సోనుకు కేలా పురస్కారం దక్కింది. ఇక కథానాయకుడు అర్జున్ కపూర్ తొలిసారి 'చెత్త నటుడు'గా ఎంపికయ్యాడు. 'గుండే', తదితర చిత్రాల్లో తన ప్రదర్శనకుగానూ అర్జున్ కు ఈ గౌరవం దక్కింది. ఇక సైఫ్ అలీఖాన్, తదితరులు నటించిన 'హమ్ షకల్స్' చెత్త సినిమాగా, చెత్త డైరెక్టర్ గా ప్రభుదేవా ('యాక్షన్ జాక్షన్')లకు కేలా పురస్కారం దక్కింది. ఇక నటుడు జాకీష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ తొలిసారి నటించిన 'హీరోపంటి' చిత్రానికి 'చెత్త డెబ్యూ'గా గుర్తింపు పొందాడు. హాలీవుడ్ లో ప్రకటించే 'గోల్డెన్ రేస్బెర్రి' చెత్త అవార్డుల బాటలో మన బాలీవుడ్ చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటిస్తుంటారు. బాలీవుడ్ కూడా వీటిని కామెడీగానే తీసుకుంటుంది.

  • Loading...

More Telugu News