: అటవీ శాఖ సిబ్బందిపై ‘ఎర్ర’ స్మగ్లర్ల రాళ్ల దాడి... గాలిలోకి కాల్పులతో పరారీ!
ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. తమకు అడ్డు వచ్చే వారిపై విరుచుకుపడుతున్న స్మగ్లర్లు నిన్న రాత్రి అటవీ శాఖ సిబ్బందిపై రాళ్లతో దాడికి దిగారు. అడవుల్లో నుంచి తెచ్చిన ఎర్రచందనం దుంగలను ఎలాగైనా తరలించుకుపోవాలనే వారి యత్నాన్ని అతికష్టం మీద అటవీ శాఖాధికారులు నిలువరించగలిగారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురంలో రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో స్మగ్లర్ల బారి నుంచి తప్పించుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పరారయ్యారు. అనంతరం, వారు తరలిస్తున్న రూ.1 కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.