: నేను కెన్యా నుంచి ఇక్కడికి రాలేదు కదా?: ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దేశ ప్రజలను ఛలోక్తులతో ఆకట్టుకున్నారు. వాషింగ్టన్ లో ఓ వార్షికోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, 'నేను అమెరికాలో పుట్టలేదని, అందుకే ఈ దేశాన్ని ప్రేమించడం లేదంటున్నారు. అంటే కెన్యా నుంచి ఇక్కడికి రాలేదు కదా? అంటూ నవ్వులు చిందించారు. '53వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను కానీ, ఆ ఊహ చాలా బాధగా ఉంది' అని ఒబామా అన్నారు. బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని చెప్పడం కఠినంగా అనిపించినా..అదే (తాను అమెరికాను ప్రేమించడం) వాస్తమని' న్యూయార్క్ మాజీ మేయర్ గిలియానీ వ్యాఖ్యలపై ఒబామా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News