: 'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుక ప్రారంభం
'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుక ప్రారంభమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఆడియో వేడుకలో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ ఇతర నటీనటులు పాల్గొన్నారు. కాసేపట్లో ఆడియోను విడుదల చేయనున్నారు. 'జులాయి' సినిమా తరువాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం, త్రివిక్రమ్ 'అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ 'రేసుగుర్రం' సినిమాల తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.