: పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక అందజేయండి: గంటా


విశాఖపట్టణం జిల్లా పాడేరులోని ఇంటర్ పరీక్షల్లో విద్యార్థుల గైర్హాజరుపై ప్రసారమైన కథనాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. పాడేరులోని ఇంటర్ పరీక్షా కేంద్రంగా కేటాయించిన ఓ కళాశాలలో గదులకు గదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భారీ సంఖ్యలో విద్యార్థులు గైర్హాజరయ్యారు. దీనిపై మీడియా కథనాలు ప్రసారం చేసింది. దీంతో విద్యాశాఖ మంత్రి స్పందించి, తక్షణం దీనిపై నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు అందజేసే ఉపకారవేతనం కోసం మదర్స్ వృత్తి విద్యా కళాశాల విద్యార్థులను చేర్చుకున్నారని, ఉపకారవేతనాలు అందుకుని వారు పరీక్షలకు గైర్హాజరయ్యారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News