: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలి: జయప్రకాశ్ నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలు-కేంద్రం హామీల అమలుపై లోక్ సత్తా పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ కేంద్రం అమలు చేయాలని అన్నారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్రతిపత్తి కోరుతూ రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన అభివృద్ధి వికేంద్రీకరణకు గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు.