: పాక్ సరిహద్దుల్లో భారీ ఖనిజాలు... రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పెరిగిన భద్రత


పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున ఖనిజాలు ఉన్నాయని కనుగొన్న తరువాత రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో భద్రత పెంచినట్టు ఈ ప్రాంత ఐజీ సంతోష్ మెహ్రా తెలిపారు. ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు సైతం పెరుగుతున్నాయని ఆయన వివరించారు. సరిహద్దులకు ఆవల పాక్ సైన్యం సైతం చురుగ్గా స్పందిస్తోందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, ఆ వివరాలు వెల్లడించలేమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ హైడ్రోకార్బన్ తో పాటు పలు ఇతర ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశీలించారని వివరించారు. ముంద్రా పోర్ట్, అదానీ పోర్ట్ తదితర సంస్థలు ఖనిజాల వెలికితీతకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News