: రాహుల్, కేసీఆర్ తదితరుల నివాసాల వద్ద పోలీసులు వేసిన 'అడ్డమైన' ప్రశ్నలివే!
ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పోలీసు అధికారులు అక్కడి సిబ్బందిని అడిగిన ప్రశ్నలు ఎటువంటివో తెలుసా? దశాబ్దాల క్రితం రూపొందించిన ఓ నమూనా ప్రశ్నావళిలోని 18 ప్రశ్నలను వారు సంధించారు. పేరు, తండ్రి పేరు, పుట్టిన ప్రదేశం, వయసెంత? వంటి ప్రశ్నలతో పాటు ఆయన శరీర రంగు ఏమిటి?, పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి?, కంటి రంగు, జుట్టు రంగు ఏమిటి? ఎంత ఎత్తు ఉంటారు?... ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు అడిగారు. ముఖ కవళికలు, కాలిజోళ్ల సైజు ఎంత? వంటి ప్రశ్నలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రశ్నలు ప్రస్తుత రోజుల్లో నవ్వు పుట్టించేవిగా ఉన్నాయన్న విమర్శలను ఢిల్లీ పోలీసు అధికారి బస్సీ అంగీకరించారు. టీవీలు, ఫోటోలు అందుబాటులో లేనప్పుడు ఇలాంటి సమాచారం ఆధారంగానే మనుషుల్ని గుర్తించేవారనీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో దీనిని మార్పు చేస్తామనీ ఆయన చెప్పారు.